మస్కట్‌ మునిసిపాలిటీ రోడ్‌ క్లోజర్‌ వార్నింగ్‌

- April 05, 2018 , by Maagulf
మస్కట్‌ మునిసిపాలిటీ రోడ్‌ క్లోజర్‌ వార్నింగ్‌

మస్కట్‌:అల్‌ ఖువైర్‌ బ్రిడ్జి ఇంటర్‌సెక్షన్‌కి సంబంధించి రెండు లేన్లను మూసివేస్తున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. హే అస్‌ సరూజ్‌ నుంచి వచ్చే మార్గం కొన్ని రోజులపాటు మూసివేయబడ్తుందని అధికారులు పేర్కొన్నారు. గురువారం నుంచి మూసివేయబడే ఈ రోడ్డు తిరిగి ఆదివారం తెరుచుకుంటుంది. రాయల్‌ ఒమన్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ క్లోజర్‌ని అమలు చేస్తారు. ట్రాఫిక్‌ రూల్స్‌కి అనుగుణంగా వాహనదారులు వ్యవహరించాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు తమ వాహనాల్ని నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే అవకాశం వున్నందున అప్రమత్తంగా వుండాలని కోరారు అధికారులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com