సిరియాలో ఆగని మారణ హోమం

- April 09, 2018 , by Maagulf
సిరియాలో ఆగని మారణ హోమం

సిరియాలోని డౌమా పట్టణంలో రసాయన దాడులు జరిగిన మరుసటి రోజే మరో ప్రాంతంలో క్షిపణి దాడులు చోటుచేసుకున్నాయి. తైఫూర్‌లోని సిరియా సైనిక ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం చోటు చేసుకున్న రసాయన దాడులపై సిరియా, దాని మిత్ర పక్షాలను అమెరికా హెచ్చరించినా ఈ క్షిపణి దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. 'సిరియాలో రసాయన ఆయుధాలు ఉపయోగించేవారిని పట్టుకునేందుకు దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తాం' అని పెంటగాన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com