డ్రగ్స్: 11 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2018
మస్కట్: 11 మంది వలసదారులు డ్రగ్స్ కలిగి వున్నారనీ, డ్రగ్స్‌ని తీసుకున్నారనే అభియోగాల నేపథ్యంలో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఇషయాన్ని వెల్లడించింది. జనరల్ డిపర్ట్‌మెంట్ ఆఫ్ నార్కోటిక్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్, బౌషర్‌లో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియాకి చెందిన నిందితులు, హెర్బల్ మెటీరియల్ అలాగే, మరిజువానా పేపర్ రోల్స్ కలిగి వున్నారనీ, వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారనీ, అలాగే 2,000 ఒమన్ రియాల్స్ పైగా నగదుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపాయి. సదరన్ షర్కియా పోలీస్ డిపార్ట్‌మెంట్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ 11 మంది నిందితుల్ని గత నెలలో డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







