ఢిల్లీ వెళ్ళాల్సిన ఒమన్‌ ఎయిర్‌ విమానం దారి మళ్ళింపు

- April 09, 2018 , by Maagulf
ఢిల్లీ వెళ్ళాల్సిన ఒమన్‌ ఎయిర్‌ విమానం దారి మళ్ళింపు

మస్కట్‌: మస్కట్‌ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఒమన్‌ ఎయిర్‌ విమానం లక్నోకి దారి మళ్లించారు. ఢిల్లీలో బ్యాడ్‌ వెదర్‌ కారణంగా ఈ దారి మళ్ళింపు జరిగినట్లు ఒమన్‌ ఎయిర్‌ వర్గాలు వెల్లడించాయి. ఎట్టకేలకు సోమవారం ఉదయం 1.27 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఉదయం 6.30 నిమిషాలకే షెడ్యూల్‌ ప్రకారం విమానం ఢిల్లీకి చేరుకోవాల్సి వుంది. 4 గంటల ఆలస్యంగా విమానం ఢిల్లీకి చేరుకుంది. బలమైన గాలులు, తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com