అల్జీరియాలో కూలిన విమానం.. 100 మంది మృతి!

- April 11, 2018 , by Maagulf
అల్జీరియాలో కూలిన విమానం.. 100 మంది మృతి!

అల్జీర్స్: అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వంద మంది సిబ్బందితో వెళ్తున్న మిలిటరీ విమానం బౌఫారిక్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందరూ మృతి చెందినట్లు తెలిసింది. విమానంలో 200 మందికిపైగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 14 అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న అన్ని రోడ్లను మూసేశారు. బౌఫారిక్ మిలిటరీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాజధాని అల్జీర్స్‌కు దగ్గర్లో విమానం కూలింది. అల్జీరియా ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com