ఫేక్ ప్రైజ్: ఖోర్ ఫక్కాన్‌లో ఇద్దరి అరెస్ట్
- April 16, 2018
ఖోర్ ఫక్కాన్:ఖోర్ ఫక్కాన్‌లో ఇద్దరు స్కామ్‌స్టర్స్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - ఈస్టర్న్ రీజియన్‌తో కలిసి ఖోర్ ఫక్కాన్ పోలీసులు ఈ నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ ద్వారా, భారీ మొత్తంలో డబ్బులు గెలుచుకున్నారంటూ అమాయకులకు నిందితులు వల విసురుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అమాయకులు వీరి మాటల్ని నమ్మి మోసపోతున్నారనీ, పెద్ద మొత్తంలో సొమ్ము దక్కించుకునేందుకు కొంత మొత్తం చెల్లించాలని నిందితులు కోరితే, బాధితులు నిజమేననుకుని డబ్బుని వారికి అందించి ఆ తర్వాత మోసం గురించి తెలుసుకుని విలపిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఖోర్ ఫక్కాన్ పోలీస్ స్టేషన్ హెడ్ మేజర్ సయీద్ ఖల్ఫాన్ అల్ నక్బి మాట్లాడుతూ, టెలి కమ్యూనికేషన్స్ ఉద్యోగిగా నిందితుల్లో ఒకరు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఫోన్లు, సిమ్‌కార్డుల్ని ఉపయోగించి నిందితులు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..