చెన్నైలో 18 మంది రోగుల ప్రాణాలు బలిగొన్నాభారీ వర్షాలు
- December 04, 2015
భారీ వర్షాలు చెన్నైలో 18 మంది రోగుల ప్రాణాలు బలిగొన్నాయి. కరెంట్ లేకపోవడంతో ఐసీయూలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందారు. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్ధోపెడిక్స్ అండ్ ట్రామటాలజీ(ఎంఐటీ) ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. భారీవర్షాలు, వరదలు కారణంగా ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 75 మందిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ లేకపోవడం, ఆక్సిజన్ సిలెండర్లు అయిపోవడంతో రోగులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 18 మంది రోగులు మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ ధ్రువీకరించారు. ఎంఐటీ ఆస్పత్రిలో 570 మందికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి 57 మందిని వివిధ ఆస్పత్రులకు తలించినట్టు చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి ఆయన ఎంఐటీ ఆస్పత్రిని సందర్శించారు. రోగుల మరణానికి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తుకు ఆదేశించామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







