శంకరాభరణం: రివ్యూ
- December 04, 2015
శంకరాభరణం జానర్ : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తారాగణం : నిఖిల్, నందిత, రావు రమేష్, సుమన్, అంజలి దర్శకత్వం : ఉదయ్ నందనవనం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: కోన వెంకట్ నిర్మాత : ఎమ్ వి వి సత్యనారాయణ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కథా రచయిత కోన వెంకట్ తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి, అన్నీ తానే అయి తెరకెక్కించిన సినిమా శంకరాభరణం. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'ఫస్ గయా రే ఒబామా' సినిమా లైన్ ను తీసుకొని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథా కథనాలు అందించారు కోన. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తూ సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను శంకరాభరణం అందుకుందా..? కోన వెంకట్ ఫ్లాప్ ట్రాక్ నుంచి బయటపడ్డాడా..? కథ : గౌతమ్ (నిఖిల్ సిద్దార్ధ్) న్యూయార్క్ లో ఆనందంగా జీవితం గడుపుతున్న కుర్రాడు. తన తండ్రికి వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు 25 ఏళ్ల క్రితమే వదిలేసి వచ్చిన తల్లి ఆస్తిని అమ్మడానికి ఇండియాకు వస్తాడు. బిహార్‌లోని పాట్నా సమీపంలో తన తల్లి పేరున ఉన్న శంకరాభరణం ప్యాలెస్ ను అమ్మి ఆ డబ్బుతో తండ్రి సమస్యలను తీర్చేయాలనుకుంటాడు. అదే ప్యాలెస్ లో నివాసం ఉంటున్న గౌతమ్ తల్లి కుటుంబసభ్యులు, ఆమె తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని ద్వేషిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకు వచ్చిన గౌతమ్ కు తన తండ్రి చిన్ననాటి స్నేహితుడి కొడుకు (సప్తగిరి) సాయంగా వస్తాడు. ఇద్దరు కలిసి ప్యాలెస్ లో ఉంటున్నవారిని ఎలాగైనా మోసం చేసి ప్యాలెస్ అమ్మేయాలని ప్లాన్ చేసుకుంటారు. అదే సమయంలో ఆ ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలో పాల్గొన్న గౌతమ్, అనుబంధాల విలువ తెలుసుకొని ఆ పని చేయలేకపోతాడు. అప్పటికే బిహార్ లో భారీగా ఆస్తులున్న ఎన్నారై అడుగుపెట్టడాన్న వార్త అక్కడున్న కిడ్నాపర్ గ్యాంగ్ లకు తెలిసిపోతుంది. చేతిలొ చిల్లిగవ్వ కూడా లేని గౌతమ్ ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ లు ఏమయ్యారు, గౌతమ్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు. చివరకు తనకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే ఎంచుకుంటున్న నిఖిల్ మరో బరువైన పాత్రతో ఆకట్టుకున్నాడు. జాలీ లైఫ్ నుంచి కష్టాల్లోకి అడుగుపెట్టిన కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా లుక్, డైలాగ్ డెలివరీ లాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నిఖిల్ ఎన్నారైగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. హ్యాపీ ఠాకూర్ పాత్రలో నందిత ఆకట్టుకుంది. కిడ్నాపర్‌గా సంజయ్ మిశ్రా కామెడీ పండిచాడు, చిన్న పాత్రలో కనిపించిన అంజలి కూడా గ్లామర్ తో పాటు విలనీని కూడా బాగా పండించింది. క్లైమాక్స్ లో వచ్చిన సంపత్ కూడా తన మార్క్ యాక్టింగ్‌తో మెప్పించాడు. రావు రమేష్, సుమన్, రఘుబాబు లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : శంకరాభరణం సినిమాకు అన్నీ తానే అయి పని చేసిన కోన వెంకట్ రచయితగా తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్ లతో థియేటర్లో నవ్వులు పూయించాడు. తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించిన ఉదయ్ నందనవనం, కథ మీద మరింత పట్టు చూపించి ఉండాల్సింది. కథనంలో థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన వేగం కనిపించలేదు. ప్రవీణ్ సంగీతం బాగుంది. రొటీన్ కమర్షియల్ మ్యూజిక్ కు భిన్నంగా డిఫరెంట్ సాంగ్స్ తో అలరించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అప్ టు ద మార్క్ లేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో చాలా సీన్లు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. విశ్లేషణ : సినిమా అంతా బిహార్ బ్యాక్ డ్రాప్ లోనే జరిగినా అన్ని క్యారెక్టర్లు తెలుగులోనే మాట్లాడతాయి. తెలుగు ప్రేక్షకుల కోసం అలా ప్లాన్ చేసినా, కనిపించే నేపథ్యానికి, వినిపించే భాషకి సంబంధం లేనట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అన్ని ఫీల్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే రచయితగా మంచి పేరున్న కోన వెంకట్, ఈ సినిమాలో మాత్రం స్క్రీన్ ప్లేతో ఆకట్టుకోలేకపోయాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్టాఫ్ లో ఆ స్థాయి వేగం కనిపించదు. సెకండాఫ్ కాస్త ట్రాక్ ఎక్కినట్టు కనిపించినా, ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సంబంధం లేకుండా మారిపోతుంటుంది. దీంతో ప్రేక్షకుడు ఏ సమయంలోనూ కథతో కనెక్ట్ అవ్వడు. సినిమా అంతా సో సోగా నడిపించిన కోన.. క్లైమాక్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. హీరో ఆడే మైండ్ గేమ్ తో ఆఖరి 30 నిమిషాలు థ్రిల్లింగ్ గా కథ నడిపించాడు. ప్లస్ పాయింట్స్ : కోన డైలాగ్స్ క్లైమాక్స్ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ స్లో నేరేషన్ ఎడిటింగ్ ఓవరాల్ గా శంకరాభరణం ఏ మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపించని క్రైమ్ కామెడీ
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







