వేసవిలో ఎసిడిటీ వస్తే ఏం చేయాలి?
- April 17, 2018
ఈరోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని నివారించటానికి ఆహారంలో మార్పు చేస్తే సరిపోతుంది.
1. పుచ్చకాయల్లో పీచు పదార్థాలు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని చల్లదనం, నీటి కారణంగా శరీరంలో హైడ్రేడ్ సమస్య తలెత్తదు. పిహెచ్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. యాపిల్, బొప్పాయి వంటి వాటిల్లో కూడా పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా కాపాడతాయి.
2. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. ఇది ప్రకృతిసిద్ధమైన డ్రింక్. ఇందులో క్లీనింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. కొబ్బరి నీళ్లలో కూడా పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లను నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
3. చల్లటి పాలు తాగితే కూడా ఎసిడిటీ సమస్య పోతుంది. స్టొమక్‌లోని యాసిడ్‌ని పాలు పీల్చేసుకుంటాయి. దీంతో కడుపులో మంట ఉండదు. కడుపులో ఎసిడిటీతో బాధపడుతున్నా, ఎసిడిటీ కారణంగా హార్ట్ బర్న్ తలెత్తినా పంచదార వేసుకోకుండా చల్లటి పాలు తాగాలి.
4. అరటిపండు ఎసిడిటీ మీద బాగా పనిచేస్తుంది. అరటి పండులోని పొటాషియం స్టొమక్ అంచుల్లో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసి శరీరంలోని పిహెచ్ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అరటిపళ్లలో పీచుపదార్ధాలు కూడా బాగా ఉన్నాయి. అందుకే వేసవిలో మిగలపండిన అరటిపండును తింటే ఎసిడిటీ సమస్య తలెత్తదు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి