విదేశాల్లో పర్యటించేందుకు సల్మాన్‌కు కోర్టు అనుమతి
- April 17, 2018
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ విదేశాల్లో పర్యటించేందుకు జోధ్‌పూర్ జిల్లా సెషన్స్ కోర్టు అనుమతించింది. కృష్ణ జింకలను హతమార్చిన కేసులో దోషి అయిన సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు బెయిలు ఇచ్చింది. విదేశాల్లో పర్యటించాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తీర్పులో పేర్కొంది. మే 25 నుంచి జులై 10వతేదీ వరకు సల్మాన్‌ఖాన్ సినిమా షూటింగు నిమిత్తం కెనడా, నేపాల్, అమెరికా దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. 1998వ సంవత్సరంలో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగు సందర్భంగా జోధ్ పూర్ అడవిలో సల్మాన్‌ఖాన్ కృష్ణజింకలను వేటాడిన విషయం పాఠకులకు విదితమే. ఇటీవల సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన రెండు రోజులు జోథ్ పూర్ సెంట్రల్ జైలులో గడిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా