లండన్, సింగపూర్లో ఎస్ బ్యాంకు బ్రాంచీలు
- April 20, 2018
న్యూఢిల్లీ : లండన్, సింగపూర్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదం పొందినట్లు యస్ బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల బ్యాంక్ వ్యాపార సేవలు మరింత పుంజుకుంటాయని, ఎన్‌ఆర్‌ఐ ఆర్థిక సేవలను విస్తరించడానికి దోహదపడుతుందని ఎమ్‌డి, సిఇఒ రాణా కపూర్ పేర్కొన్నారు. కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రాల్లో ప్రతినిధుల కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో తమ అభివృద్ధికి, నిబద్ధతకు గుర్తింపు లభించినట్లయిందని ఆయన పేర్కొన్నారు. ఎస్ బ్యాంక్ మొదటి కార్యాలయాన్ని 2015 ఏప్రిల్ లో అబూ దాబీలో ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఐఎఫ్‌ఎస్‌సి బ్యాంకింగ్ యూనిట్ గిఫ్ట్ సిటీ పేరుతో గాంధీనగర్‌లో ప్రారంభించామని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







