‘భరత్‌ అనే నేను’ రివ్యూ

- April 20, 2018 , by Maagulf
‘భరత్‌ అనే నేను’ రివ్యూ

కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని కొత్త బ్యాక్ డ్రాప్ ని  అందించాడు దర్శకుడు కొరటాల శివ.  మషేష్ బాబు ముఖ్య మంత్రిగా చేస్తున్నాడనే విషయం సాధారణ ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తిని కలిగించింది.  టీజర్స్ అండ్ ట్రైలర్ లతో భరత్ ఇప్రెస్ చేసాడు.. బ్లాక్ బస్టర్ ఇస్తాడనే ప్రామిస్ అభిమానులకు చేసినట్లు ప్రమోషన్స్ జరిగాయి. మరి భరత్ ఇచ్చిన మాట నిలుపుకున్నాడా చూద్దాం...
కథ:
భరత్ రామ్ (మహేష్ బాబు) రాఘవరామ్  ( శరత్ కుమార్) రాజకీయ నాయకుడి కొడుకు. అతను ఒక పొలిటికల్ పార్టీ పెట్టి కుటుంబం ను పట్టించుకోవడంలో విఫలం అవుతాడు. తల్లి( ఆమని) ని కోల్పోయిన భరత్ తండ్రి రెండో పెళ్ళి చేసుకోవడం తో  లండన్ కి  తన మావయ్య కుటుంబం తో చదువు కోసం వెళతాడు.  ముఖ్యమంత్రిగా ఎదిగిన తండ్రి  గుండె పోటుతో చనిపోవడంతో భరత్ లండన్ నుండి తిరిగి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అతను ముఖ్య మంత్రిగా చార్జ్ తీసుకుంటాడు. నిజాయితీగా వ్యవస్థను పనిచేయించేందుకు అతను తీసుకునే పాలసీలు సొంత పార్టీలోనే విరోధుల తయారవుతారు. అయితే ఎదరయ్యే ప్రతి సమస్యను అతను నిజాయితీగా ఎదుర్కుంటాడు. ప్రజల్లో బలం పెంచుకుంటున్న భరత్  సొంత పార్టీలో వీక్ అవుతుంటాడు.  కొన్ని పరిస్థితుల్లో రాజీ నామా చేసిన భరత్ తను అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించాడు అనేది మిగిలిన కథ...?
కథనం:
సినిమా తో ప్రేక్షకుడ్ని ఎంటర్ టైన్ అయ్యేలా చేయడం ప్రతి దర్శకుడు బాధ్యత. ఆ బాధ్యతతో పాటు సినిమా చూసి వెళ్ళే ప్రేక్షకుడు ఎంతో కొంత మంచి ని తీసుకెళ్ళాలి. సినిమా ని కేవలం టైంపాస్ లా కాకుండా దానికి సామాజిక బాధ్యత కూడా ఉండాలి అని నమ్మే దర్శకుడు కొరటాల శివ.  అందుకే అతని సినిమాలు అందులోని సమస్యలు సమాజం ను ప్రతి బింబిస్తాయి. నిజమే కదా ఇలా చేస్తే బాగుంటుంది అనే  ఆలోచన కలిగిస్తాయి. శివ అక్కడే దర్శకుడిగా, కథకుడిగా సక్సెస్ అయ్యాడు. ఆ విలక్షణ ప్రతిభే అతన్ని మూడు సినిమాలతోనే గొప్ప దర్శకుల జాబితాలో చేర్చింది. భరత్ అనే నేను కూడా అలాంటి ప్రయత్నమే నిజాయితీగా చేసాడు. ప్రతి వాడికి తానే ముందు వెళ్లాలనే తొందర, రూల్స్ కాస్త అటూ ఇటూ అయినా పర్లేదు గమ్యం చేరుకునేందుకు అడ్డదారులు తొరగా తొక్కేస్తాం. అందుకే సియమ్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత శివ చూయించిన ట్రాఫిక్ సీన్ ప్రేక్షకుల ఆలోచనల్లో కాస్త మార్పు తీసుకు వస్తుంది.  సియమ్ గా మహేష్ ఎలా ఉంటాడు అనే క్యూరియాసిటీ శివ ప్రజంటేషన్ లో అడ్మైరింగ్ గా మారుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వాడే నిజమైన మగాడు అంటూ తన క్యారెక్టర్ లోని దమ్ముని ఒక్క డైలాగ్ తో చూపించాడు.  శివ తీసుకున్న తర్వాత సమస్య ఎడ్యుకేషన్ దీని పరిష్కారం కూడా చాలా కన్వెన్సింగ్ చెప్పాడు.  సియమ్ గా భరత్ చార్జ్ తీసుకునేంత వరకూ సినిమా ప్రయాణం కాస్త నిదానంగా సాగుతుంది. ఒక్కసారి ఛార్జ్ తీసుకున్నాక భరత్ వేగం పుంజుకుంటాడు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా  ఉన్నాయి. ‘ మరీ కూరగాయల బేరం ’ ఆడొద్దు అని మహేష్ ప్రకాష్ రాజ్ కి ఇచ్చే సమాధానం థియేటర్స్ లో విజిల్స్ కొట్టించింది.  ఎడ్యుకేషన్ సిస్టం పై భరత్ చూపిన సొల్యూషన్ బాగుంది. మరీ పొలిటికల్ గా సీరియస్ గా వెళ్ళకుండా అలా అని కమర్షియాలిటీ తో నింపేయకుండా దర్శకుడు ఈ కథను బాలెన్స్ చేసాడు. కథనం లో సింప్లిసిటీ కనపబడుతుంది. కనిపించే సీన్స్ లో లోతు తెలుస్తుంది. అలాంటి సీన్స్ ని డిజైన్ చేయడంలో దర్శకడు విజయం సాధించాడు.  పొలిటికల్ జండాలు మారతాయి కానీ జనాల జీవితాలు కాదు అనే సిద్దాంత అలవాటు పడిన రాజకీయ నాయకులపై భరత్ చేసిన యుద్దం ప్రేక్షకుల మనసులను  గెలిచింది.  మీడియా కాన్ఫరెన్స్ లో మహేష్ నటన తారా స్థాయిలో నిలిచింది. ఆవేదన, ఆవేశం కలసి మహేష్  ఆ సీన్ తో చాలా చెప్పాడు. కియారా అద్వాని నటన కంటే ఆమె అందానికి ఎక్కువ మార్కులు పడతాయి. దేవి స్వరాల కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వచ్చాడయ్యో సామి పాట సందర్భం, చిత్రీకరణ చాలా బాగున్నాయి.  ప్రకాష్ రాజ్ చాలాకాలం తర్వాత కీలక పాత్రతో మెప్పించాడు.  ఫార్మల్ లో కనపడే మహేష్ లుక్స్ బాగున్నాయి.  పొలిటకల్ బ్యాక్ డ్రాప్ లో భావోద్వేగాలతో నిండిన ప్రేమ కథను అల్లుకోవడం తో శివ సక్సస్ అయ్యాడు. 
చివరిగా:
భరత్ - బ్లాక్ బస్టర్ కు హామీ ఇచ్చాడు. 

--మాగల్ఫ్ రేటింగ్: 3.25/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com