'ఐపీఎల్' అభిమానులకోసం ఉచిత రైలు
- April 20, 2018
చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కావేరీ జలాల వివాదం కారణంగా పూణేకు మార్చారు. ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మాక్కూడా మ్యాచ్ చూసే ఏర్పాట్లు ఏదైనా చేయండంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కోరారు. వారి కోరిక మేరకు సీఈవో కాశీ విశ్వనాథన్ ఫాన్స్ క్లబ్ సభ్యులను ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి పూణేకు తీసుకువెళ్లడానికి నిర్ణయించింది. విజిల్ పోడు ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టి మ్యాచ్ టికెట్లతో పాటు, భోజనం వసతి కూడా ఉచితంగానే కల్పించే ఏర్పాట్లు చేసింది. శుక్రవారం పూణేలో రాజస్తాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ అభిమానులకు కనువిందుచేయనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కి ఇలాంటి ఏర్పాట్లు చేయడం కష్టం అని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







