క్రిస్ గేల్‌కి అరుదైన గౌరవం
- April 21, 2018కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లోని బెల్‌ని మోగించి గేల్ మ్యాచ్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ 11వ సీజన్‌లో జరిగిన మ్యాచుల్లో కింగ్స్ పంజాబ్ జట్టు తరఫున గేల్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఆడిన రెండు మ్యాచుల్లో 68, 103 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్ ఆడుతున్న గేల్ ఈడెన్ గార్డెన్స్‌లో బెల్‌ని మోగించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గతంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ రాహుల్ ద్రవిడ్ సహా బ్రెట్ లీ, షేన్ వార్న్ తదితరులు ఈ బెల్ మోగించారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రిస్ గేల్ కూడా చేరాడు.
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్‌లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!