45,000 ఎలక్ట్రానిక్ వీసాలను జారీ చేసిన మస్కట్ ఎయిర్పోర్ట్
- April 24, 2018
మస్కట్: మార్చి 21 నుంచి ఏప్రిల్ 16 వరకు మొత్తం 45,000 ఎలక్ట్రానిక్ వీసలను జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. దుబాయ్‌లోని అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఎటిఎం)లో ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఏటీఎంలో పాలుపంచుకుంటోంది. ఏప్రిల్ 22న దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఏటీఎం ప్రారంభమయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండర్ సెక్రెటరీ మైతా సైఫ్ అల్ మహ్రౌకి నాయకత్వంలో ఓ డెలిగేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొంది. మైతా మాట్లాడుతూ, సుల్తానేట్‌లో టూరిజం డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనీ, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభం కూడా అందులో బాగమేనని చెప్పారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 16 వరకు 45,947 ఎలక్ట్రానిక్ వీసాలను మంజూరు చేశామని చెప్పారాయన. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో ఫేజ్ ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తవుతోందని అన్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్‌లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









