ఇమ్రాన్‌ఖాన్‌ మూడో పెళ్లీ పెటాకులు

- April 25, 2018 , by Maagulf
ఇమ్రాన్‌ఖాన్‌ మూడో పెళ్లీ పెటాకులు

ఇస్లామాబాద్‌: ముచ్చటపడి చేసుకున్న మూడో పెళ్లి కూడా పెటాకులు కావడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ కష్టాలు ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్‌ మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు, పిల్లల వ్యవహారాల్లో దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయని, గొడవపడిన తర్వాత మూడో భార్య బుష్రా తన పుట్టింటికి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

పిల్లలు.. పెంపుడు కుక్కలు: పాకిస్తాన్‌ మీడియా కథనాల ప్రకారం.. ఇమ్రాన్‌ పెంపుడు కుక్కల వల్ల కొత్త భార్య బుష్రా ఇబ్బందులు పడ్డారు. మతపరమైన కార్యకలాపాలకు కుక్కలు ఆటంకం మారడంతో వాటిని ఇంట్లో నుంచి పంపేయాలని భార్య కోరగా, అందుకు ఇమ్రాన్‌ నిరాకరించారు. బుష్రాకు మొదటి భర్త ద్వారా కలిగిన పిల్లలు ఇప్పుడు ఇమ్రాన్‌తోనే కలిసి ఉండటం కూడా గొడవలకు మరో కారణమని తెలిసింది. పెల్లల్ని వేరుగా ఉంచాలని పెళ్లికి ముందే ఇమ్రాన్‌-బుష్రాల మధ్య ఒప్పందం జరిగిందని, కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని, అలా మొదలైన గొడవలు క్రమంగా పెద్దవై దంపతులు విడిపోయేదాకా వెళ్లిందని టైమ్స​ ఆఫ్‌ ఇస్లామాబాద్‌ పత్రిక పేర్కొంది. కాగా, ఇమ్రాన్‌ పెళ్లి పెటాకుల వార్తలు సోషల్‌ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

మూడు నెలలు తిరక్కుండానే: 1995లో బ్రిటన్‌ బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్‌.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015లో బీబీసీ జర్నలిస్ట్‌ రేహమ్‌ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా 9 నెలలకే ఆ బంధమూ తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్‌ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే ఇలా జరగడంపై కుటుంబీకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com