పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 138
- April 25, 2018
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ వార్షిక నివేదికలో గత ఏడాది కన్నా భారత్ మరో రెండు స్థానాలు దిగజారిపోయింది. వాచ్‌డాగ్ మీడియా రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటియర్స్ బుధవారం వెల్లడించిన ఈ సూచీలో 180 స్థానాల్లో భారత్ 138వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 136వ స్థానంలో భారత్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సూచీలో నార్వే మరోమారు టాప్-1 నిలిచింది. భారత్‌లో జర్నలిస్టులను లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, రాడికల్ జాతీయ వాదులు జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాశ్మీర్‌లో పాత్రికేయులకు వ్యతిరేకంగా హింసాకాండ చెలరేగుతోందని, అక్కడ విదేశీ విలేఖర్లను నిషేధించారని, ఇంటర్నెట్ సదుపాయాన్ని తరుచుగా తొలగిస్తున్నారని సాన్స్ ఫ్రంటియర్ వివరించింది. గత ఏడాది ముగ్గురు జర్నలిస్టులు హత్య గురయ్యారంటూ మోదీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు ఎదురవుతున్న సవాళ్లను పేర్కొంది. జర్నలిజం చట్టబద్ధతను వివాదస్పదం చేయడం నిప్పుతో చెలగాటమేనని వాచ్‌డాగ్ సెక్రటరీ జనరల్ క్రిస్టోఫ్ డెలాయిర్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







