సాయి ధరమ్‌తేజ్‌ కొత్త సినిమా 'ఫస్ట్ లుక్'

సాయి ధరమ్‌తేజ్‌ కొత్త సినిమా 'ఫస్ట్ లుక్'

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ .. కరుణా కరన్ తో సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించి బుధవారం ప్రీలుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాయిధరమ్ ని బ్యాక్ నుండి చూపించిన మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అదే రోజు రివీల్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. డార్లింగ్ సినిమాలకు మాటలు అందించిన డార్లింగ్ స్వామి ఈ చిత్రానికి కూడా మాటలు అందిస్తున్నాడు. గోపీ సుందర్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Back to Top