ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం!

- December 05, 2015 , by Maagulf
ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం!

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఫ్రీ పార్కింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేసి వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు నడుం బిగించారు. ఫ్రీ పార్కింగ్‌ పాయింట్ల ఫార్మూలా సక్సెస్‌ కావడంతో వీటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం నగర ప్రజలకు పార్కింగ్‌ ఇబ్బందులు తప్పనున్నాయి. చలాన్ల చిక్కులకు...అక్రమ వసూళ్ల బెడదకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. ఫ్రీపార్కింగ్‌ పేరుతో పార్కింగ్‌ పాయింట్లను ట్రాఫిక్‌ పోలీసులే ఏర్పాటుచేస్తున్నారు. వాహనదారులు ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అమీర్‌పేట్‌లో ప్రయోగాత్మకంగా ఫ్రీ పార్కింగ్‌ పాయింట్‌ అమీర్‌పేట్‌లోని మైత్రి వనం దగ్గర ప్రయోగాత్మకంగా ఫ్రీ పార్కింగ్‌ పాయింట్‌ను ఏర్పాటుచేశారు. ఇది సక్సెస్‌ అవడంతో జాబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌ దగ్గర మరో పాయింట్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు వంద వరకు ఫ్రీ పార్కింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేశారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో బ్యానర్లు కట్టి వాహనదారులను ఆహ్వానిస్తున్నారు. రానున్న కాలంలో ఫ్రీపార్కింగ్‌ పాయింట్ల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. వీటి సంఖ్య 200 నుంచి 400 వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యం ఫ్రీపార్కింగ్‌ స్థలాల కేటాయింపులలో ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యం కూడా ఉండేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాలనీ సంఘాలతో ప్రతినిధులతో మాట్లాడి..మోడల్‌ కాలనీలను ఎంపిక చేస్తున్నారు. ఈ కాలనీలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కాలనీలలోని అంతర్గత రోడ్లలో రద్దీగా ఉన్న ఏరియాల్లో ఫ్రీ పార్కింగ్‌ పాయింట్ల ఏర్పాటు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com