బాంబు వదంతులతో అమీర్‌పేట కలకలం ..
- December 05, 2015
ఎప్పుడూ సందడిగా ఉండే అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో బాంబు ఉందంటూ వచ్చిన వదంతులతో ఒక్కసారిగా కలకలం రేగింది. సత్యం థియేటర్ సమీపంలో ఒక సూట్‌కేసు అనుమానాస్పద పరిస్థితులలో కనిపిచండంతో అక్కడ ఉన్నవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు బాంబుస్క్వాడ్ చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. పాస్‌పోర్ట్ ఆపీసు ఎదురుగా ఉన్న టిఫెన్ సెంటర్‌వద్ద పడిఉన్న సూట్‌కేస్‌ను బాంబు స్వ్కాడ్ తెరిచి చూడగా అందులో ల్యాప్‌టాప్, చార్జర్, కొన్ని దుస్తులు, కాగితాలు మాత్రం ఉన్నాయి. పాస్‌పోర్ట్ పనిమీద వచ్చిన ఎవరో హడావుడిగా టిఫెన్‌చేసి సూట్‌కేస్‌ను మరిచిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సూట్‌కేస్ బాంబు ఉందని ప్రచారం జరగడంతో పాస్‌పార్ట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని స్క్వాడ్ సభ్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబుస్వ్కాడ్ వచ్చి సూట్ కేసును తెరిచి చూసే వరకూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







