కొత్త బస్ రూట్‌ని ప్రారంభించిన మవసలాత్
- April 26, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మవసలాత్, కొత్త మస్కట్ - ఇబ్రి - బురైమి రూట్‌ని ప్రారంభించింది. ఏప్రిల్ 27 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని మరింతగా విస్తరించే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త రూట్స్‌ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్‌లు అత్యంత భద్రతతో కూడుకున్నవని అధికారులు తెలిపారు. అల్ అజైబా స్టేషన్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అల్ సహవా టవర్, నిజ్వా మార్కెట్, బాహ్లా మార్కెట్, ఇబ్రి, ధనక్ రౌండెబౌట్, సునయ్నాహ్ మీదుగా బురైమి చేరుకుంటాయి. టిక్కెట్లను బస్‌లోగానీ, కంపెనీ కార్యాలయంలోగానీ పొందవచ్చు. మస్కట్ - ఇబ్రి - బురైమి లైన్‌లో రోజుకి రెండు ట్రిప్స్ ఈ బస్సులు నడుస్తాయి. తొలి బస్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చేరుకుంటుంది. బురైమీ చేరుకునేసరికి సమయం 4 గంటలవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







