న్యూస్ ఛానెల్స్ ను దెబ్బ తీసిన చంద్రబాబు ధర్మ దీక్ష..!
- April 26, 2018
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం తన పుట్టిన రోజు నాడే ధర్మదీక్ష పేరుతో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రే దీక్ష చేపట్టడంతో, కవర్ చేయడం తప్ప మీడియా ఛానెల్స్ కు వేరే దారి లేకపోయింది. ఉదయం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ మొదట ధర్మదీక్ష ఏర్పాట్లు, ఆ తర్వాత ధర్మదీక్ష, అనంతరం బాబు ప్రసంగం, ఇలా మొత్తమ్మీద కలిపి ఆంధ్రాన్యూస్ ఛానెల్స్ ఆరోజు 15 గంటలు చంద్రబాబుకు దాసోహమయ్యాయి.
కొందర్ని భయపెట్టి, ఇంకొందరికి ఐదు నుంచి పది వరకూ లక్షల రూపాయలు ఇచ్చుకుని, ధర్మదీక్షను న్యూస్ ఛానెల్స్ తో రోజంతా హడావిడి చేయించి జాతీయ అంశంగా చేయాలనుకున్నారు చంద్రబాబు అండ్ పార్టీ. అయితే అది సరిగ్గా ఫలించినట్టు లేదు. బాబు ధర్మదీక్ష చేసిన ఆ ఒక్కరోజున, తెలుగు న్యూస్ ఛానెల్స్ కు రెగులర్ గా వచ్చే రేటింగుల కంటే దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. టీఆర్పీ మొత్తం భయంకరంగా డౌన్ అయిపోవడం గమనార్హం. తెలుగులో ఏ న్యూస్ ఛానెల్ కు రేటింగ్ రాలేదు. రెగులర్ గా వచ్చే రేటింగ్ కన్నా ఆరోజు తక్కువ రేటింగులు నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







