20 గంటల పాటు నాన్‌స్టాప్ విమాన ప్రయాణం..
- April 26, 2018
సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొత్త ఎయిర్‌బస్ ను త్వరలో ప్రారంభించనుంది. దీంతో 20 గంటల పాటు నాన్‌స్టాప్‌గా విమానంలో ప్రయాణం చేసే అవకాశం కలగనుంది. ఇప్పటి వరకు ఏ ఇతర విమాన సంస్థ కూడా ఇన్ని గంటల పాటు ఆకాశంలో ప్రయాణించే సౌకర్యాన్ని కలిగించలేదు.
సింగపూర్ విమానయాన సంస్థ ప్రారంభించే కొత్త ఎయిర్‌బస్ 20 గంటల్లో 11,160 మైళ్ల దూరం ప్రయాణించ గలదు. ప్రస్తుతం ఈ విమానం టెస్ట్ రైడ్ పూర్తిచేసుకుంది.
సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణించే ఎ 350- 900 యూఎల్ఆర్ విమానం ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుంది.
9,500 మైళ్ల దూరం గల ఈ రూట్‌లో గతంలో ఉన్న విమానాన్ని 2013లో రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రస్తుతం మరింత వేగవంతంగా ప్రయాణించే ఎయిర్‌బస్సులను ప్రవేశపెట్టేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ సిద్ధమయింది.
కొత్తగా రూపొందించిన ఎయిర్‌బస్ లలో క్యాబిన్‌ల క్వాలిటీ పై అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. లాంగ్ ట్యూబ్ మాదిరిగా కాకుండా ఒక రూమ్ మాదిరిగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం కాంటాస్ సంస్థ ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే ఎయిర్ బస్‌ను కలిగిఉంది. పెర్త్ నుంచి లండన్ వరకు గల దూరాన్ని 17 గంటల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంటోంది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!