జయ సమాధి తవ్వడం తప్పదా..?
- April 26, 2018
జయలలిత తన తల్లినంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ దాఖలు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. అమృత పిటీషన్ ను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు డీఏఎన్ పరీక్ష కోసం రక్తం వంటి బయాలాజికల్ (జీవ సంబంధిత) శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా అపోలో హాస్పిటల్స్ ను ఆదేశించింది. తమ వద్ద జయలలితకు సంబంధించిన బయలాజికల్ శాంపిల్స్ ఏవీ లేవని హాస్పిటల్ కోర్టుకు తెలిపింది. చాలా రోజుల తరవాత హాస్పిటల్ దాఖలు చేసిన అఫడవిట్ ఇపుడు ఈ కేసులో కీలకంగా మారనుంది. ఆమెకు సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద లేవని స్పష్టం చేయడంతో.. కోర్టు మున్ముందు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.జయ మృతికి సంబంధించి ఎలాంటి విచారణ వద్దని ఒకవైపు ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాధి తవ్వి ఆమె అవశేషాలు తీసి పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశిస్తుందా? అన్న టెన్షన్ ఆమె అభిమానుల్లో నెలకొంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







