గల్ఫ్ ఎయిర్‌కి చారిత్రక దినం
- April 28, 2018
మనామా:గల్ఫ్ ఎయిర్ చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. తొలి బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ తమ ఫ్లీట్‌లో చేరినందుకు గల్ఫ్ ఎయిర్ వర్గాలు అమితానందాన్ని వ్యక్తం చేశాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ వివామంన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ల్యాండ్ అయ్యింది. సంప్రదాయ వాటర్ కెనాన్ సెల్యూట్ ద్వారా ఈ విమానానికి స్వాగతం పలికారు. మీడియా, ఏవియేషన్ ప్రముఖులతో ఈ బ్రాండ్ న్యూ ఎయిర్ క్రాఫ్ట్‌కి టెర్మినల్‌లో ఘన స్వాగతం పలకడం జరిగింది. గల్ఫ్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రెసిమిర్ కుక్కో, ఎయిర్‌లైన్స్ ఎగ్జిక్యూటివ్స్ డెలిగేషన్ ఆఫ్ వీఐపీలుగా, ప్రభ్తువ ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రతినిథులు, సభ్యులు ఎయిర్‌రకాఫ్ట్‌ని టెర్మినల్ వద్ద స్వాగతించారు. 2018 చివరి నాటికి 39 కొత్త బోయింగ్ మరియు ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్‌లను తన ఫ్లీట్‌లో చేర్చుకోనుంది. వీటిల్లో ఐదు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్స్, రెండు ఎయిర్ బస్ ఏ 320 నియో ఎయిర్ క్రాఫ్ట్‌లు వుంటాయి.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్‌లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం