ఘోర ప్రమాదం: ఎమిరేటీ యువకుడి మృతి
- April 28, 2018
18 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రస్ అల్ ఖైమాలోని అల్ జజిరా అల్ హమారా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత కారు రెండు ముక్కలుగా విడిపోయింది. రస్ అల్ ఖైమా సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్, సమాచారం అందగానే సంఘటనా స్థలనాఇకి చేరుకుంది. రెస్క్యూ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా యువకుడి ప్రాణాల్ని కాపాడలేకపోయారు. తీవ్ర గాయాలతో యువకుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ సామ్ అల్ నక్బి వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి