మళ్ళీ దెబ్బకొట్టిన ఫేస్బుక్
- April 29, 2018డేటా లీక్స్ టెన్షన్ నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్బుక్ అధినే మార్క్ జూకర్ బర్గ్ మరో బాంబు పేల్చారు. మున్ముందు మరింతగా డేటా లీక్ ఉండే అవకాశముందని ఫేస్బుక్ తెలిపింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో ఫేస్బుక్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫేస్బుక్ నుంచి సేకరించిన కోట్ల మంది డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ చట్ట సభలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్బుక్ ఎస్ఈసీకి తెలిపింది. దీనివల్ల తమ బ్రాండ్, వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కూడా తెలిపింది. కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్స్ వ్యవహారం కంపెనీ నిర్లక్ష్యానికి మున్ముందు భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలుస్తోంది. బ్రిటన్, యూఎస్ చట్టసభలు కంపెనీ భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు