'మహానటి' ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో..

'మహానటి' ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో..

భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందమూరి తారక్ విచ్చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. ఇప్పుడు అదే బాటలో మహానటి కూడా నడుస్తోంది. ఓ స్టార్ హీరోని గెస్ట్‌గా పిలవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు రిలీజై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ రోజు మంగళవారం మిగిలిన పాటలను కూడా రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నాడని సమాచారం. 

Back to Top