నెంబర్ ప్లేట్‌పై బర్త్ డేట్
- May 01, 2018దుబాయ్: కారు నెంబర్ ప్లేట్ మీద మీ బర్త్ డేట్ చూసుకోవాలనుకుంటున్నారా? బర్త్ డేట్ మాత్రమే కాదు, మీ జీవితంలో ముఖ్యమైన రోజుల్ని గుర్తు చేసుకునేందుకుగాను, మీ కార్ నెంబర్ ప్లేట్ మీద వాటిని నమోదు చేసుకోవచ్చు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అందుకు అవకాశం కల్పిస్తోంది. 'యువర్ మెమరబుల్ మూమెంట్స్ ఆన్ యువర్ వెహికిల్స్ ప్లేట్' - వి కోడెడ్ ప్లేట్స్ పేరుతో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. 1967 నుంచి 2018 వరకు నెంబర్ ప్లేట్స్ అందుబాటులో వుంటాయి. ఆర్టిఎ లైసెన్సింగ్ ఏజెన్సీ - వెహికిల్స్ లైసెన్సింగ్ డైరెక్టర్ సుల్తాన్ అల్ మర్జోకి మాట్లాడుతూ, ప్లేట్ ఖరీదు 1,670 దిర్హామ్‌లుగా వుంటుందని వెల్లడించారు. దుబాయ్ వ్యాప్తంగా వున్న కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్స్, స్ట్రాటజిక్ పార్టనర్స్, ఆర్టిఎ వెబ్సైట్, దుబాయ్ డ్రైవ్ యాప్ ద్వారా కూడా నెంబర్ ప్లేట్స్‌ని సొంతం చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం