నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 27 మంది దుర్మరణం
- May 01, 2018
నైజీరియాలోని ముబి పట్టణంలో రెండు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనల్లో 27 మంది అక్కడికక్కడే మృతి చెందగా 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఆత్మాహుతి మసీదు లోపల జరిగిందని, మరో దాడి అదే మసీదుకు సమీపంలో దుస్తుల మార్కెట్ బయట జరిగిందని అడమావా రాష్ట్ర సమాచార కమిషనర్ అహ్మద్ సాజో పేర్కొన్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని స్థానిక అధికారి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి