ఇరాక్‌ కాల్పుల్లో 16 మంది మృతి..

ఇరాక్‌ కాల్పుల్లో 16 మంది మృతి..

ఆయుధాలతో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్‌లోని సలాహుద్దీన్‌ ప్రావిన్స్‌లో నిన్న సాయంత్రం జరిగింది. బాగ్దాద్‌ నగరానికి సమీపంలో ఉన్న దుజైల్‌ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి.. మూడు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్‌ అల్‌ మర్‌జౌక్‌ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారుల ఇళ్లుగా గుర్తించారు అధికారులు. చనిపోయిన వారంతా రహిమ్‌ అల్‌ మర్‌జౌక్‌ కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుడు పరారీలో ఉండటంతో.. గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు కల్నల్‌ మహమ్మద్‌ అల్‌ జుబౌరీ తెలిపారు. 

Back to Top