వేలాదిమంది కార్మికులకు దుబాయ్‌లో కొత్త అకామడేషన్
May 01, 2018
400 మంది దుబాయ్ మునిసిపాలిటీ కార్మికులకు కొత్త అకామడేషన్ ఏర్పాటవుతోంది. ఈ ఏడాదిలోనే అల్ వర్సాన్‌లో వారికి కొత్త ఇళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వర్కర్స్ డే సందర్భంగా మునిసిపాలిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కార్మికుల్ని ఆదుకుంటోన్న ఛారిటీస్, ప్రైవేట్ కంపెనీస్‌ని సన్మానించారు. గత వారం 138 మంది కార్మికులు మునిసిపాలిటీ ఉమ్రా ప్రార్థనల కోసం పంపింది. అలాగే 8,000 కిట్స్‌ని రమదాన్ ఇఫ్తార్ మీల్స్ సందర్భంగా పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. కొత్త లేబర్ అకామడేషన్‌లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సౌకర్యాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సిటీ వద్ద అల్ వార్సన్ 2, అల్ వార్సన్ 3 అకామడేషన్స్ వున్నాయి.