పది లక్షల మంది గొంతులతో 'కాలా' పాట రికార్డ్
May 03, 2018
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. ఈ సినిమాలోని ఒక పాటను ఏకంగా పది లక్షల మందితో రికార్డ్ చేసినట్టుగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించారు. తనకు ఎప్పటి నుంచో ఒక పాటకు పది లక్షల గొంతులను రికార్డ్ చేయాలన్న కల ఉందని చెప్పుకొచ్చాడు. కాలా సినిమాలోని పాటకు ఆ అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో రికార్డింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నాన్నాడు.