హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నాగోల్, మోహన్ నగర్ , కొత్తపేట్ , చైతన్య పురి , దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, పాతబస్తీ, అశోక్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్, బహదూర్ పురా, యాకుత్ పురా, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, సైదాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. విద్యానగర్ శివమ్ రోడ్ లో చెట్లు విరిగి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Back to Top