'జంబలకిడి పంబ' టీజర్ విడుదల
- May 03, 2018
1993లో ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకిడి పంబ చిత్రం సినీ లవర్స్ పొట్ట చెక్కలయ్యేలా ఎంతగా నవ్వించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడాళ్ళు మగాళ్ళుగా మారి ఆదిపత్యం చలాయించడం, మగాళ్ళు ఆడాళ్ళుగా మారి వంటింటికి పరిమితం కావడం వంటి సన్నివేశాలు సిల్వర్ స్క్రీన్పై పసందైన విందు అందించాయి. అయితే జంబలకిడి పంబ టైటిల్తో మరో చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించనుంది. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలలో సోలో హీరోగా నటించిన శ్రీనివాస రెడ్డి ప్రధానపాత్రలో మరో జంబలకిడి పంబ తెరకెక్కుతుంది. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జంబలకిడి పంబ. ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని తెలుస్తుంది. గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, అరకు, వైజాగ్, కేరళ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదల చేశారు. ఇందులో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముంబై మోడల్ సిద్ధి ఇద్నానీ ఈ చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అవుతుంది. టీజర్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి