మస్కట్‌ మెయిన్‌రోడ్‌ - మూసివేత & ప్రకటన

- May 03, 2018 , by Maagulf
మస్కట్‌ మెయిన్‌రోడ్‌ - మూసివేత & ప్రకటన

మస్కట్‌: సుల్తాన్‌ కబూస్‌ స్ట్రీట్‌కి సంబంధించి ఓ సెక్షన్‌లో మూడవ లేన్‌ని (రుహీపై) ఈ వారంతంలో మూసివేయనున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి మస్కట్‌ మునిసిపాలిటీ ఈ మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మే 3 నుంచి ఆదివారం అంటే మే 6 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ పనుల నిమిత్తం రోడ్డుని మూసివేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ సూచనల మేరకు తమ వాహనాల్ని నడపవలసి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com