పెళ్లిలో 'హవా హవా': వైరల్
- May 04, 2018
ఒరు ఆదార్ లవ్ చిత్రం విడుదల కాకముందే అమ్మాయి హవా నడుస్తోంది. ఇప్పటికే బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్న ప్రియ ఎక్కడికి వెళ్లినా సెలబ్రిటీ హోదాలో సందడి చేస్తోంది. అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. షాపింగ్ మాల్కి వెళితే చుట్టు ముట్టేస్తున్నారు. సెల్ఫీ ప్లీజ్.. అంటూ ప్రియకి ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు. తాజాగా ఒరు ఆదార్ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్ వివాహానికి హాజరైంది ప్రియ. ఇంకేముంది వచ్చిన అతిధులు పెళ్లి చూడ్డం మానేసి ప్రియ దగ్గరకు పరిగెట్టారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియ పింక్ రంగు చీరకట్టులో అలరించింది. అంతేకాదు తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ సినిమాలోని 'హవా హవా' అనే పాటకు స్టెప్పులేసింది. ప్రియ రాకతో పెళ్లి పందిరి అంతా సందడి నెలకొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియ చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..