బ్యాంక్ లోన్ ముందు కడితే భారీ జరిమానా...
- May 04, 2018
బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఠంచన్‌గా కట్టాలనేది రూల్. తీసుకున్న లోన్ నయాపైసాతో సహా కడతామంటే కస్టమర్‌కు ఫుల్‌గా సపోర్ట్ చేయాలి. ఇంకాచెప్పాలంటే ది బెస్ట్ కస్టమర్ అని కీర్తించాలి. ఎందుకంటే ఈ మధ్య బ్యాంకులను ముంచి పారిపోయిన బడా పారిశ్రామికవేత్తలు.. రూపాయుల్లో ఆస్తులు చూపించి పైరవీలతో కోట్లలో లోన్లు ఎగ్గొట్టి ఫారిన్ చెక్కేసారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ సంస్థ పద్ధతిగా తీసుకున్న అప్పు చెల్లిస్తామంటే.. కాదు కుదరదు.. రూల్స్ ఒప్పుకోవన్నారు.
ట్రావెల్ క్లబ్ సంస్థకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో కోటిన్నర వరకూ లోన్ ఉంది. అది 2020లో ఎక్స్‌పైర్ అవుతుంది. అయితే అనేక ఆర్థిక కారణాలతో సదరు సంస్థ ముందే లోన్ తీర్చేస్తామంటూ కోటక్ బ్యాంక్‌ను సంప్రదించింది. అయితే లోన్ ముందే కట్టేస్తే.. రూ.6 లక్షల పెనాల్టీ కట్టాలంటూ బ్యాంక్ హుకుం జారీ చేసింది. ఆర్బీఐ నిబంధనలు ఇలానే ఉన్నాయా అంటూ ప్రశ్నించిన టివి5 సిబ్బందిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లోన్ డిఫాల్ట్ అయితే అసలు, వడ్డీ వదులుకుంటాం కానీ.. ఇలా ముందే అప్పు తీర్చేస్తే ప్రీ పేమెంట్ పెనాల్టీ కట్టాల్సిందేనని మొండికేస్తోంది కోటక్ మహీంద్రా బ్యాంక్.
అప్పుల్లో కూరుకుపోతున్న బ్యాంకింగ్ వ్యవస్థపై ఇప్పటికే సామాన్యుల్లో నమ్మకం తగ్గిపోతోంది. అందుకే బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేయకుండా ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. ఇక జీఎస్టీ వంటి వాటితో ఇప్పటికే వ్యాపారాలు చేసుకోలేక సతమతమైపోతున్న వ్యాపార వర్గాలకు బ్యాంకులు ఇలా చుక్కలు చూపిస్తున్నాయి. లోన్ ముందే తీర్చేస్తాం మొర్రో అంటున్నా వినకుండా పెనాల్టీలు విధిస్తామనడం ఎంత వరకూ సమంజసమో అర్థం కావడం లేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..