లెబనాన్లో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు
- May 07, 2018
బీరూట్: తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం లెబనాన్లో ఆదివారం తొలిసారిగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో దేశ ప్రజలు తమకు మెరుగైన భవిష్యత్తు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు అద్యక్షుడు మైకేల్ ఓన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది వారి 'పవిత్ర కర్తవ్యమ'ని అన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రభుత్వంలో తమ ప్రతినిధులను ఎన్నుకుంటారని ఆయన వివరించారు. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా యువత చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో దేశ పరిస్థితిలో పెను మార్పులు రాగలవని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా త్వరలో విద్యను ముగించుకుని జీవన ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్న యువత తమకు ఉద్యోగావకాశాలు కావాలని, మరింత ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటోంది. ఆదివారం నాటి ఎన్నికల్లో 976 మంది అభ్యర్థుల భవితను నిర్ణయించేందుకు దాదాపు 37 లక్షల మందికి పైగా ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







