ఫ్లిప్ కార్ట్ ను దక్కించుకున్న వాల్ మార్ట్

- May 09, 2018 , by Maagulf
ఫ్లిప్ కార్ట్ ను దక్కించుకున్న వాల్ మార్ట్

ఈ-కామర్స్‌ దిగ్గజం  ఫ్లిప్‌కార్ట్‌..వాల్‌మార్ట్‌ సొంతమైపోయింది.   కొద్ది  రోజులుగా  ఈ  రెండు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలకు ఈ రోజుతో ఫుల్‌‌స్టాప్ పడింది.  డీల్‌ ఖరారు కావడంతో, ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయింది.  అమెరికా రిటైల్‌ దిగ్గజం  వాల్‌మార్ట్‌... ఫ్లిప్‌కార్ట్‌ ను   సొంతంచేసుకున్నట్లు ఈ సంస్థ  ప్రధాన   వాటాదారైన  సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్‌    ధృవీకరించేశారు. 2007లో బెంగళూరులో రెండు బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు అమెజాన్  మాజీ ఉద్యోగులు బిన్నీ బన్సాల్‌, సచిన్‌ బన్సాల్‌. అలా మొదలైన  సంస్థ  అంతకంతకు ఎదుగుతూ 2014లో ఆన్‌లైన్‌ అప్పీరల్‌ రిటైలర్‌ మింత్రాను 300 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫోన్‌పేను 2016లోనే తన సొంతం చేసుకుంది. అనంతరం జబాంగ్‌ను 2016లో 70 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com