మలేసియాలో పార్లమెంట్ ఎన్నికలు
- May 09, 2018
కౌలాలంపూర్ : అవినీతి ఆరోపణలు, కుంభకోణాల నేపథ్యంలో మలేసియా పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. వారాంతంలో కాకుండా మధ్యలో ఓటింగ్ నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గుతుందని పార్టీలు భావిస్తున్నాయి. అయితే 85శాతం వరకు పోలింగ్ శాతం నమోదవుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ప్రధానితో సహా పలువురు ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని నజీబ్ రజార్ నేతృత్వంలోని పాలక సంకీర్ణం, మహితిర్ మహ్మద్ నేతృత్వంలోని ప్రతిపక్షం మధ్య ప్రధానంగా పోరు సాగుతోంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







