బాదామి హరియాలి
- May 10, 2018కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 5, పచ్చిమిర్చి - 4, బాదం తరగు - అరకప్పు, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు, మెంతి ఆకులు - అరకప్పు, ఉడికించిన బీన్స్ - 1 కప్పు, పచ్చిబఠాణి - 1 కప్పు, తాజా క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు, పంచదార - 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పనీర్ తురుము - అలంకరణకు.
తయారుచేసే విధానం: బాదం తరుగుతో పాటు ఉల్లి కాడలు (తెల్లని భాగం మాత్రమే), కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో బిర్యాని ఆకుతో పాటు బాదం పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించాలి. ఇప్పుడు మెంతి ఆకులు, పచ్చిబఠాణి, ఉప్పు, పంచదార, జీలకర్ర పొడి కలిపి 8 నిమిషాల ఉంచాలి. తర్వాత ఉడికించిన బీన్స్, క్రీమ్ వేసి 3 నిమిషాలు తర్వాత పనీర్ తురుము చల్లి దించెయ్యాలి. నాన్, పరాటాలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్