సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- May 14, 2024
అమరావతి: సీఎం జగన్‌కు సీబీఐ స్పెషల్ కోర్టు భారీ ఊరట కల్పించింది. సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 17వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత ఫోన్ నంబర్, జీ మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్‌ను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్.. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా ఇవాళ పై తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







