హెచ్చరిక : ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు, భారీ వర్షం పడే అవకాశం..

- May 11, 2018 , by Maagulf
హెచ్చరిక : ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు, భారీ వర్షం పడే అవకాశం..

ఒడిశా రాష్ట్రంలో నెలకొన్న ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాను ఆవరించింది.. దీంతో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలోని ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ముందస్తు హెచ్చరిక జారీచేసింది ఐఎండీ.. దీంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలు ఎక్కడం, ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండటం. ఎత్తైన చెట్లను ఆనుకుని ఉండటం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేయడం వలన పిడుగు ఆ ప్రదేశాలను ఎక్కువగా ఆకర్షిస్తోందని దానివలన ప్రమాదం జరగవచ్చని అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com