'నేల టిక్కెట్టు' ఆడియో విడుదల చేసిన పవర్ స్టార్
- May 11, 2018
ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం "నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు. రామ్ తాళ్లూరి సోషల్ సర్వీస్‌లో భాగంగా `నేల టిక్కెట్ ` చిత్రంలో రవితేజ వాడిన క్యాష్‌ను దివ్యాంగులకు ఇచ్చారు. ఎస్ ఓ ఎస్ సంస్థకు రూ.లక్ష చెక్ అందించారు. ఎస్ ఓ ఎస్ రవీంద్రకుమార్ అందుకున్నారు.
ఈ వేడుకకు హాజరైన రవితేజ మాట్లాడుతూ, 'పదేళ్ల క్రితం ఒకరికి నేను ఫోన్ చేశాను. ఆ వ్యక్తి పక్కన పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్.. 'మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండి?' అని అన్నారు. ఈ కాంప్లిమెంట్ ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది వరకు ఇధ్దరం బాగానే కలుసుకుంటూ ఉండే వాళ్లం. ఇప్పుడు బిజీ అయిపోవడంతో కలవలేకపోతున్నాం. ఇక 'నేలటిక్కెట్టు' సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా విజయం సాధిస్తుంది' అని రవితేజ అన్నాడు.
కల్యాణ్‌గారు చాలా సింపుల్ వ్యక్తి. ఆయన కేరక్టర్ గురించి తెలిసిన వాడిగా నేను ఈ సినిమా హిట్ అవుతుందని చెబుతున్నాను. రవితేజగారి సినిమాను నేను థియేటర్లలో చూసినప్పుడు ఓ మేరేజ్ హాల్‌కి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఆడియన్స్ ఆయన్ని హీరోలా కాకుండా, ఓ ఫ్యామిలీ మెంబర్‌లాగా చూసుకుంటారని అర్థమైంది`` అని చెప్పారు.
జగపతిబాబు మాట్లాడుతూ ``నేను ఎలాంటి పాత్రలు చేసినా ప్రేక్షకులు అభినందిస్తున్నారు. అలాంటి పాత్రలు చేసి, చేసి అలాగే మారిపోతానేమోనని అనిపిస్తోంది. నేను దశాబ్దం క్రితమే పవన్ వ్యక్తిత్వం అంటే ఇష్టమని చిరంజీవిగారితో చెప్పాను. `బడ్జెట్ పద్మనాభం` సినిమా చేసేటప్పుడు నేను హీరో, రవి కేరక్టర్. ఆ సినిమాలో ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అదే ఫ్రెండ్లీనెస్ ఇప్పటికీ ఉంది. మాస్, క్లాస్ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా రామ్‌గారు, ఆయన భార్య రజనీగారికోసమైనా హిట్ కావాలి`` అని అన్నారు.
జెమిని కిరణ్ మాట్లాడుతూ ``మా చంటిగాడు లోకల్ నేల టికెట్ అని వస్తున్నాడు. ఇంక అందరికీ జింతాతా జింతాతానే`` అని చెప్పారు.
దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ ``ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. శక్తికాంత్ సంగీతం బావున్నాయి. నేలటికెట్ ఎలాంటి డౌట్ లేకుండా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత రామ్‌గారు చాలా పెద్ద ఎఫెర్ట్ పెట్టారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









