వ్యోమగామి పాత్రలో వరుణ్ తేజ్...
- May 11, 2018
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా "ఘాజీ" సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం బ్రహ్మస్మి సినిమా ఇటీవల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రాలో నటించబోతున్నాడు. అంతరిక్ష నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అందుకు తగిన విధంగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియో లో ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ప్రత్యేకంగా సెట్ వెయ్యడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ ఆ సెట్ లోనే జరుగుతోంది.
అహం బ్రహ్మస్మి టైటిల్ తో
అహం బ్రహ్మస్మి
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా "ఘాజీ" సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం బ్రహ్మస్మి సినిమా ఇటీవల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. హీరో, హీరోయిన్స్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు.
ప్రశాంత్ విహారి సంగీతం
ప్రశాంత్ విహారి
వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి ఎదుగురు, రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.
వరుణ్ తేజ్ వ్యోమగామి
వ్యోమగామి
ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రాలో నటించబోతున్నాడు. అంతరిక్ష నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అందుకు తగిన విధంగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియో లో ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ప్రత్యేకంగా సెట్ వెయ్యడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ ఆ సెట్ లోనే జరుగుతోంది. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ పరిశోదకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
జార్జియాలో ప్రత్యేకంగా వేసే సెట్లలో
జార్జియాలో
తాజాగా స్టార్ట్ అయిన షెడ్యూల్ పూర్తి అయ్యాక ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ అమెరికాలో షూట్ చేయనున్నట్లు సమాచారం. జార్జియాలో ప్రత్యేకంగా వేసే సెట్లలో సినిమా కొంత భాగం చిత్రీకరిస్తారట. యాక్షన్ సీక్వెన్సుల కోసం హలీవుడ్ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







