గాజా లో ఇజ్రాయిల్‌ సైన్యం కాల్పులు 52 మంది మృతి

- May 14, 2018 , by Maagulf
గాజా లో ఇజ్రాయిల్‌ సైన్యం కాల్పులు 52 మంది మృతి

గాజా: అమెరికా తన రాయబార కార్యాలయాన్ని జెరూసలేంలో ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ గాజా- ఇజ్రాయిల్‌ సరిహద్దుల్లో పాలస్తీనీయులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీసింది. అమెరికా చర్యను నిరసిస్తూ పాలస్తీనా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులను అణిచివేసేందుకు ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో సుమారు 41 మంది మృతి చెందారు. 900 మందికి గాయాలు కాగా.. వారిలో 86 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జెరూసలేంను ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తిస్తున్నట్టు ప్రకటన చేసి మధ్యప్రాచ్యంలో ఆందోళనలు రేకెత్తించిన వేళ అమెరికా ఇవాళ ఓ అడుగు ముందుకేసి తన రాయబార కార్యాలయాన్ని టెల్‌అవీవ్‌ నుంచి జెరూసలేంకు తరలించగా దాదాపు 35వేల మంది పాలస్తీనాయులు ఇజ్రాయిల్‌ -గాజా సరిహద్దులో నిరసనకు దిగారు. వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు దిగిన ఇజ్రాయిల్‌ సైన్యం సుమారు 52 మందిని హతమార్చింది. కంచెను తెంచుకొని ఇజ్రాయిల్‌లోకి ప్రవేశించేందుకు యత్నించేవారే లక్ష్యంగా కాల్పులకు దిగిన ఇజ్రాయిల్‌ సైన్యం డ్రోన్ల సాయంతో ఆందోళనకారులపై బాష్ప, వాయు గోళాలను కురిపించింది. ఈ చర్యలకు వెరవని పాలస్తీనీయులు సరిహద్దుల్లో ఆందోళనల్ని కొనసాగిస్తున్నారు. కాల్పులపై ఆందోళన వ్యక్తంచేసిన పాలస్తీనా నేతలు అంతర్జాతీయ సమాజం ఈ ఘటనపై దృష్టిసారించాలని కోరుతున్నారు. అటు, ఇజ్రాయిల్‌ సైన్యం మాత్రం అక్రమ చొరబాట్లను నిరోధించేందుకే కాల్పులు జరిపినట్టు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com