అంతర్జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటిన 'తెలుగు తేజం'

- May 14, 2018 , by Maagulf

దుబాయ్:దుబాయ్ లోని షబాబ్అల్ అహ్లి ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్ లో ఈ నెల 11 న జరిగిన బుడోకాన్ కప్ 2018 ఇంటర్నేషనల్  కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో దుబాయ్ నగరానికి చెందిన ఏడు సంవత్సరాల  బాలుడు పగడాల జతిన్ సాయి రెడ్డి రెండు విభాగాలలో రెండు ద్వితీయ స్థానాలు సాధించి  విజయ కేతనం ఎగురవేశాడు. ఈ పోటీలలో 7 మరియు 8 సంవత్సరాల బాలుర విభాగంలో నిర్వహించిన “కతా” మరియు “కుమిటో” విభాగాలలో రెంటిలో ద్వితీయ స్థానాలను సాధించి భారత దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసాడు. ఈ పోటీలలో వివిధ దేశాలకు చెందిన 1400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com