రమదాన్: మవసలాత్ టిక్కెట్ దరల తగ్గింపు
- May 14, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, పవిత్ర రమదాన్ మాసం సంద్భంగా టిక్కెట్ ధరల్ని తగ్గించింది. ఈ తగ్గింపు 20 శాతం వరకూ వుంది. క్యాపిటల్ పరిధిలోని టిక్కెట్ ధరలపై మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మస్కట్ వెలుపల మాత్రమే ఈ తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. మస్కట్ పరిధిలో ఉదయం 6.30 నిమిషాల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి 15 నుంచి 20 నిమిషాల వరకు బస్ సర్వీసులు అందుబాటులో వుంటాయి. షిప్పింగ్ సర్వీసులకు సైతం ఈ 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని మవసలాత్ పేర్కొంది. రమదాన్ నేపథ్యంలో వర్కింగ్ అవర్స్ మారిన దరిమిలా మస్కట్ - బార్కా, మస్కట్ - సమైల్, మస్కట్ - రుస్తాక్లలో ట్రిప్స్ సంఖ్యను మార్చగా, మిగతా రూట్లలో ఎలాంటి మార్పూ లేదని మవసలాత్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







