కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు..స్మృతి ఇరానీకి మళ్లీ షాక్!

- May 15, 2018 , by Maagulf
కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు..స్మృతి ఇరానీకి మళ్లీ షాక్!

దిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో సోమవారం రాత్రి స్వల్ప మార్పులు చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు దిల్లీలోని ఎయిమ్స్‌లో కిడ్నీ శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన బాధ్యతల్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయించారు. జైట్లీ కోలుకొనే వరకు ఇంఛార్జిగా ఆర్థిక శాఖ బాధ్యతల్ని పీయూష్‌గోయల్‌ పర్యవేక్షించనున్నారు. అలాగే సమాచార, ప్రసారాల శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించారు. ఆ శాఖను రాజ్యవర్థన్‌సింగ్‌ రాఠోర్‌కు అప్పగించారు. స్మృతి ఇరానీని జౌళి శాఖ మంత్రిగానే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి పదవి నుంచి ఆల్ఫోన్స్‌ కన్నథానమ్‌ను తప్పించిన ప్రధాని.. ఎలక్ట్రానిక్స్‌ శాఖను ఎస్‌ఎస్‌ అహ్లూవాలియాకు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com